పునీత్ బాధ్యత ను విశాల్ తీసుకున్నాడు

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. పునీత్ మరణం యావత్ సినీ ప్రేక్షకులను , అభిమానులను, సినీ ప్రముఖులను శోకసంద్రంలో పడేశాయి. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరిగాయి. ఇక పునీత్ రాజ్ తన సంపాదన ఎక్కువ శాతం సమాజ సేవకే ఉపయోగించారు. వాటిలో ఒకటి 1800 మంది చిన్నారులను పునీత్ చదివిస్తున్నాడు. ఇప్పుడు ఆ బాధ్యత నటుడు విశాల్ తీసుకున్నారు.

‘ఎనిమి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశాల్ మాట్లాడుతూ.. పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని, మేకప్, ఉన్నా లేకున్నా, ఇంట్లో కలిసినా, బయట కలిసినా ఎక్కడైనా ఆయన ఒకేలా మాట్లాడేవారని కోలీవుడ్ నటుడు విశాల్ అన్నారు. సమాజానికి పునీత్ ఎంతో చేశారని, ఎంతోమందికి ఉచిత విద్యను అందించడంతోపాటు వృద్ధాశ్రమాల్ని కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేసుకున్నారు.

ఒకే ఒక్క మనిషి ఇన్ని పనులు చేశాడంటే నమ్మలేకున్నానని, ఇప్పటి వరకు ఆయన చదివించిన 1800 మంది చిన్నారుల బాధ్యతను ఇకపై తానే చూసుకుంటానని, ఈ విషయంలో పునీత్‌కు మాటిస్తున్నానని చెబుతూ విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.