మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం..

మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు కారు బావిలో పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు కారులోనే చిక్కుకున్నారు. మరో ముగ్గురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా పర్వతగిరి అన్నారం షరీఫ్ కు కారులో వెళ్తుండగా మరో ఇద్దరు లిఫ్ట్‌ అడిగి కారులో ఎక్కారు. ఏడుగురుతో వెళ్తున్న కారు కేసముద్రం బైపాస్‌ వద్ద అదుపుతప్పి బావిలో పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడగా. ఒకరు మృతి చెందారు మరొకరు అపస్మారక స్థితిలో ఉండగా చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరూ కారులోనే ఉండిపోయారు. ఈ విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందినవారిగా గుర్తించారు.