పీవీకి భారతరత్న.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్

Bharat Ratna to PV Narasimha Rao

తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం పట్ల యావత్ తెలుగు ప్రజలు , రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ NTRకి కూడా భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం మరింత పులకించిపోయేది. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఈ రోజున నిండుగా, మెండుగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఈ అంశాన్ని బలపరుస్తాయని నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అని రాసుకొచ్చారు.