చంద్రబాబు ముసలి నక్క, లోకేష్ గుంట నక్క అంటూ విజయసాయి ఫైర్

ఏపీలో టెన్త్ ఫలితాలు ప్రభుత్వాన్ని విమర్శల పలు చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తీర్ణత శాతం తగ్గడం ఫై ప్రభుత్వం ఫై టీడీపీ విమర్శలు చేస్తూ వస్తుంది. నిన్నటికి నిన్న టెన్త్ లో ఫెయిల్ అయినా విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ వీడియో కాల్ లో మాట్లాడుతుండగా..వైస్సార్సీపీ నేతలు అందులోకి రావడం వివాదస్పదంగా మారింది. దీనిపై పెద్ద రగడ చోటుచేసుకుంది. తాజాగా ఈ అంశంపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. చంద్రబాబు ముసలి నక్క, లోకేష్ గుంట నక్క అని వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడిని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఈ మధ్య ప్రారంభమైందని.. లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ అంటూ చురకలు అంటించారు.

ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన ప్రారంభించారని.. ముసలి నాయుడు, పప్పు నాయుడు ‌..ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలని విజయసాయి హెచ్చరించారు. ప్రభుత్వానికి.. విద్యార్థులు ఫెయిల్ అవటానికి సంబంధం ఉండదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు చేయవచ్చని..నిన్నటి జూమ్ … ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. పప్పు నాయుడు సవాలును స్వీకరిస్తున్నాం.. చంద్రబాబు అయినా రావచ్చు…మా నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమేనని ఛాలెంజ్‌ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా… చర్చకు మేం సిద్ధమని..నిన్న లోకేష్ పారిపోయాడు.. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయటం లేదు..? అని నిలదీశారు.