థ్యాంక్యూ ట్రైలర్ రిలీజ్

వరుస హిట్ల తో ఫుల్ జోష్ లో ఉన్న నాగ చైతన్య..ప్రస్తుతం ‘థాంక్యూ’ మూవీ తో జులై 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే, ప్రమోషన్ కార్య క్రమాలపై మేకర్స్ దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు సాంగ్స్ రిలీజ్ కాగా..ఈరోజు మంగళవారం చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి ఆసక్తి పెంచారు.

మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు’ అని నాగచైతన్య చెప్పే డైలాగ్ తో ‘థాంక్యూ’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. హీరో జీవితంలోని మూడు దశలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అతని ప్రేమ బాధ కోపం సంతోషం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ఈ ట్రైలర్ ని కట్ చేశారు.

నాగచైతన్య స్కూల్ డేస్ లో మాళవిక నాయర్ తో ప్రేమను.. కాలేజ్ లో ఉన్నప్పుడు అన్న అంటూ అవికా గోర్ రాఖీ కట్టడం.. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగే క్రమంలో రాశీ ఖన్నాతో ప్రేమాయణం వంటివి ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా చైతూ ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా.. కాలేజ్ స్టూడెంట్ గా.. యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన లుక్స్ లో క్లాస్ అండ్ మాస్ గెటప్స్ లో కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లజెంట్ గా అనిపిస్తోంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ విజువల్స్ ఆకర్షణీయంగా మరియు క్లాస్ గా ఉన్నాయి. మొత్తం మీద ట్రైలర్ తో సినిమా ఫై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.