బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ ఫస్ట్ రియాక్షన్

చందమామ ఫేమ్ కాజల్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు రావడం తో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆమెకు విషెష్ అందజేయడం స్టార్ట్ చేసారు.అలాగే కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే తమకు పుట్టిన బిడ్డకు నీల్‌ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్లు కాజల్​ భర్త గౌతమ్‌ తెలిపారు.

ఇక తొలి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ మాతృత్వపు ఆనందాన్ని పఁడుతున్నట్లు తెలిపింది. తన బిడ్డకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన బిడ్డ నీల్ ను ప్రపంచంలోకి ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని కాజల్ తెలిపింది.

తొలిసారి నీల్ తన ఛాతీపై పడుకున్నప్పుడు ప్రేమకు సంబంధించి ఎంతో లోతైన భావనను పొందానని తెలిపింది. ఆ క్షణం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పింది. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంత సులువైన విషయం కాదని… మూడు రోజులు తాను నిద్రలేని రాత్రులను గడిపానని తెలిపింది. బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకుందామా అనే ఆత్రుతను అనుభవించానని తెలిపింది. ఇప్పుడు బిడ్డ కళ్లలోకి ప్రేమగా చూడటం, హత్తుకోవడం చేస్తూ కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకుంటున్నానని తెలిపింది. అద్భుతమైన ఈ ప్రయాణాన్ని ఆనందంగా సాగిస్తున్నామని చెప్పింది.