చెడబుట్టిన చెత్త వెధవలు అంటూ నిప్పులు చెరిగిన వంగలపూడి అనిత

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు సభల్లో , సమావేశాల్లో మాత్రం పార్టీల మధ్య మాటల తూటాలు కొనసాగేవి. కానీ ఇప్పుడు అంత కూడా సోషల్ మీడియా లోనే కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా చేసుకొని విమర్శలు ,ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. అంతే కాదు అసభ్య పోస్టులు సైతం పోస్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలో వైస్సార్సీపీ సోషల్ మీడియాకు చెందిన కొందరు అసభ్యకరంగా పోస్టులు, ట్వీట్‌లు, పోస్టర్లు వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. దీనిపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.

‘అమ్మ కడుపున చెడబుట్టిన చెత్త వెధవలు. తల్లికీ, చెల్లికీ, భార్యకు తేడా తెలీని చిత్తకార్తె కుక్కలందరినీ ఒక చోట చేర్చి వైసీపీ సోషల్ మీడియా అని పేరు పెట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక మహిళలపై అసభ్య పోస్టర్లు వేస్తున్న వీరిపై డీజీపీ చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చూసుకోమంటారా?’అంటూ అనిత ట్వీట్ చేశారు. డీజీపీని కూడా ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. అలాగే అచ్చెన్నాయుడు సైతం ప్రజా సమస్మలను పక్కదారిపట్టించేందుకు వైస్సార్సీపీ నీతిమాలిన చర్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజు రోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీబీఐ,ఈడీ కేసులు, కోర్టుల చివాట్లు, అధికార పార్టీ నేతల అవినీతిపై ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక నీతి మాలిన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.