అమెరికా టాక్ షోలో ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాలు..

ఆర్ఆర్ఆర్ మూవీ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. బాహుబలి మూవీ తో తెలుగు సినిమా సత్తా ఏంటో హాలీవుడ్ కు రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. ఇక ఈ చిత్రం తో ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్థాయి ఓ రేంజ్ కి వెళ్లింది. తాజాగా రామ్ చరణ్ రేంజ్ హాలీవుడ్ సినిమాల అవార్డుల వేడుకలో యాంకరింగ్ చేయమని పిలిచే వరకు వెళ్లిందంటే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వరకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం చరణ్ అమెరికా లో సందడి చేస్తున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో ప్రజెంటర్‌గా చరణ్ చేయబోతున్నారు.
ఈ నెల 24న జరగబోయే ఈ వేడుక కోసం రామ్‌చరణ్ అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లాడు. ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొన్నాడు. అందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలు , రాజమౌళి గురించి , నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలువడం ఫై ఇలా అనేక విషయాలు తెలుపగా…ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి ప్రస్తావన వచ్చింది.
త్వరలోనే ఫస్ట్ బేబీ రాబోతుంది కదా.. ఇప్పుడు నువ్వు బిజీ అయిపోతావేమో అని చరణ్‌తో ఓ యాంకర్ సరదాగా అడిగింది. తండ్రి అవుతున్నందుకు ఏమైనా భయాలు ఉన్నాయా? అని అడుగగా… అప్పుడు ఇన్నాళ్లు ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు.. కానీ ఇప్పుడు తప్పడం లేదని సరదాగా చరణ్ చెప్పుకొచ్చాడు.