ఉక్రెయిన్‌కు ఎఫ్‌-16 ఫైటర్ జెట్‌లను సరఫరా చేయనున్న అమెరికా

US Agrees to Supply Ukraine With F-16 Fighter Jets

కీవ్‌ః ఉక్రెయిన్ ద‌ళాల‌కు ఎఫ్‌-16 ఫైట‌ర్ విమానాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని అమెరికా యోచిస్తున్న‌ది. జ‌పాన్‌లో జ‌రుగుతున్న జీ7 స‌మావేశాల్లో దీనిపై అధ్య‌క్షుడు జో బైడెన్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ జేక్ సుల్విన‌న్ తెలిపారు. అత్యంత అధునాత‌న ఎఫ్‌-16 ఫైట‌ర్ విమానాల విష‌యంలో కీవ్ పైలెట్ల‌కు అమెరికా ద‌ళాలు శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న వెల్ల‌డించారు. ఎఫ్‌-16 ఫైట‌ర్ జెట్స్ కావాల‌ని ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి అమెరికాను అభ్య‌ర్థిస్తున్న‌ది. అమెరికా చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.

కాగా,అమెరికా ప‌శ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్నాయి. దాంట్లో ఎఫ్‌-16 యుద్ధ విమానం కూడా ఉంటుంద‌ని అమెరికా వెల్ల‌డించింది. ఉక్రెయిన్ పైలెట్ల‌కు ఫైట‌ర్ జెట్ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు అమెరికా చెప్పింది.