తూ. గోదావరి జిల్లాలో దారుణం : మైనర్ బాలిక ఫై బాబాయ్ అత్యాచారం

ఏపీలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం , పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం వారి ఆగడాలు ఆపడం లేదు. వావి వరుసలు మరచి దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తూ. గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్‌ ఆత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజం తలెత్తుకోకుండా చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక పదో తరగతి పాస్‌ అయింది. ఆమె చిన్న తాత కుమారుడు (25) గత జూన్‌ లో ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఓ కూల్ డ్రింక్‌ తీసుకొని ఇంటికి వచ్చాడు. బాబాయి తెచ్చిన కూల్‌ డ్రింక్‌ ను ఆ అమ్మాయి సంతోషంగా తాగింది. ఆ తర్వాత ఆ బాలికపై ఆత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు మరియు వీడియోలు తీసి, బెదిరించాడు. ఎవరికైనా చెబితే ఆ ఫోటోలను సోషల్‌ మీడియా లో పెడతానని బెదిరించాడు. ఆ తర్వాత అతడు ప్రతి రోజు టార్చర్‌ పెడుతుండడం తో తట్టుకోలేక.. తల్లిదండ్రులకు చెప్పింది దీంతో ఆ తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు.