వాక్సిన్ వచ్చాకే ప్రేక్షకులు మళ్లీ థియేటర్స్ కు వస్తారు ..

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు వ్యాఖ్య

Film Producer Suesh Babu
Film Producer Suesh Babu

పరిస్థితులు యధాస్థితికి వచ్చేందుకు చాలా నెలల సమయం పట్టవచ్చు. ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్లకు రావడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు.

కరోనాకు వ్యాక్సిన్ తయారు అయినప్పుడే ప్రేక్షకులు మళ్లీ థియేటర్ల వైపునకు వస్తారని ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు అభిప్రాయ పడ్డారు.

ఇండస్ట్రీలో మునుపటి స్థితి ఏర్పడాలంటే కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చి వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రావాలి.

ఆ తర్వాత కూడా ఇండస్ట్రీ లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయని.. థియేటర్ల విషయంలో కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబ్యూటర్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తు సమయంలో తీవ్రంగా నష్టపోయారంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు

టాలీవుడ్ కు చాలా కీలకం అయిన ఈ సమ్మర్ సీజన్ లో కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా విడుదల అయ్యే పరిస్థితి లేదు.

పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి మరో ఆరు నెలల సమయం అయినా పడుతుందని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/