వందమంది తో ప్రభుదేవా నాటు నాటు స్టెప్స్

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ గా ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డు ను సైతం ఈ సాంగ్ దక్కించుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ కు ఎంతోమంది స్టెప్స్ వేసి అలరించగా…తాజాగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఏకంగా 100 మంది తో నాటు నాటు స్టెప్స్ వేసాడు. స్టూడియోలో వంద మందితో కూడిన తన బృందంతో ప్రభుదేవా నాటునాటు హూక్ స్టెప్పులు వేశారు.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆర్ఆర్ఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుదేవా ఆయన బృందం హుషారుగా చేసిన నాటు నాటు స్టెప్పు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. థ్యాంక్యూ లెజెండ్ అని ట్వీట్ చేసింది.

అలాగే జర్మనీ దౌత్య సిబ్బంది కూడా నాటు నాటు పాటకు స్ట్రీట్ డ్యాన్స్ చేశారు. ఈ పాటలో జర్మన్ ఎంబసీ ఉద్యోగులతో కలిసి జర్మనీ రాయబారి కూడా కాలు కదపడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. కొరియన్ ఎంబసీ తరహాలోనే జర్మనీ దౌత్య కార్యాలయ సిబ్బంది కూడా ఢిల్లీ చాందినీ చౌక్ లో నాటు నాటు పాటకు స్టెప్పులేశారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. చూస్తుంటే నాటు నాటు పాటకు ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారో అని దౌత్య కార్యాలయాలు ఒలింపిక్స్ తరహాలో పోటీ పడుతున్నట్టుంది అని చమత్కరించారు.