రఫెల్‌ నడాల్‌ లాక్‌డౌన్‌ అనుభవాలు

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలు పాటించడమే మంచిదని ఫెడెక్స్‌ సూచన.

Rafael nadal
Rafael nadal

మాడ్రిడ్‌: కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఖాళీ సమయంలో ఆటగాళ్లందరు ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్‌ చేస్తు టచ్‌లో ఉంటున్నారు. తాజాగా స్పేయిన్‌బుల్‌ రఫెల్‌ నడాల్‌ లాక్‌డౌన్‌ అనుభవాలను ఫెడరర్‌, ఆండిముర్రే తో పంచుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా తాను టెన్నిస్‌ ప్రాక్టిస్‌ చేయలేక పోతున్నట్లు నడాల్‌ తెలిపాడు. కాగా స్పేయిన్‌లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో కఠిన నిబందనలు అమలుచేస్తున్నారు. తాజాగా కోద్దిగా సడలింపులు ఇచ్చినప్పటికి టెన్నిస్‌ సాధనకు మాత్రం అనుమతి లేదు. టెన్నిస్‌ ప్రాక్టిస్‌లో చాలా భౌతిక దూరం పాటిస్తాం. మరి ఎందుకు సడలింపు ఇవ్వడం లేదో అర్దం కావట్లేదు అని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో రఫెల్‌ చెప్పాడు. ఇదే సమయంలో తనకు కు మోకాలి చికిత్స జరగడంతో తాను ఇంట్లోనే పునరావాస చికిత్స తీసుకుంటున్నట్లు ఫెడెక్స్‌ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సూచనలు పాటించడమే మంచిదని ఫెడెక్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/