జర్నలిస్టులకు చంద్రబాబు పలు జాగ్రత్తలు

జర్నలిస్టులు కరోనా వైరస్‌ బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది..

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: కరోనా మహమ్మారి ముంబయిలోని 53 మంది మీడియా ప్రతినిధులకు, చెన్నైలోని పలువురు జర్నలిస్టులకు సోకిన విషయం తెలిసిందే. అయితే ఈనేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు వారికి జాగ్రత్తులు చెబుతూ పలు ఫోటోలు పోస్ట్‌ చేశారు. ‘ప్రియమైన మీడియా ప్రతినిధుల్లారా.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధిలాంటివారు. కరోనా నేపథ్యంలో మీతో పాటు మీ కుటుంబం పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. చాలా మంది జర్నలిస్టులకు కొవిడ్‌19 సోకడం ఆందోళన కలిగిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దయచేసి ఈ జాగ్రత్తలను మీ సెల్‌ఫోన్లలో సేవ్‌ చేసుకోండి. పూర్తి జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉంటే కరోనా విజృంభణను ఎదుర్కోవచ్చని ప్రపంచానికి చాటి చెప్పండి’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/