తమన్నా ఫై బోల్డ్ కామెంట్స్ చేసిన ఉమైర్‌ సందు

ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్‌ సందు..తమన్నా ఫై కీలక కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. హ్యాపీ డేస్ మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన తమన్నా..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల తో పాటు చిన్న హీరోల సరసన నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్ల రాకతో అమ్మడికి ఛాన్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన , వెబ్ సిరీస్ లలో నటిస్తూ మెప్పింది.

తాజాగా తమన్నా ఆమె ప్రియుడు విజయ్‌ వర్మ కలిసి నటించిన ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’ వెబ్‌ సిరీస్‌ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో ప్రియుడు విజయ్‌తో కలిసి పలు ఇంటిమేట్‌ సీన్లలో తమన్నా దర్శనం ఇచ్చారు. ఇద్దరి మధ్యా శృంగారం ఎక్కువ పాళ్లలో ఉండటంతో సోషల్‌ మీడియా వ్యాప్తంగా తమన్నాపై విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చిత్ర విమర్శకుడు ఉమైర్‌ సందు తమన్నాపై.. ఆమె ప్రియుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హద్దులు దాటుతూ నీచంగా మాటలన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

ప్రస్తుత కాలంలో అడల్ట్‌ వెబ్‌ సిరీస్‌ కోసం తమన్నా మొదటి ఛాయిస్‌ అయిపోయింది. ఆమె విజయ్‌ వర్మతో రాత్రి, పగలు బాగా ఎంజాయ్‌ చేస్తోంది’’ అని పేర్కొన్నాడు.

YouTube video