శునకానికి బంగారు విగ్రహం

అలబాయ్ జాతి శునకాలపై దేశాధ్యక్షుడి ప్రత్యేక అభిమానం

golden-statue-for-rare-alabai-breed-dog-in-turkmenistan

యాష్గబట్: తుర్క్ మెనిస్థాన్ దేశాధ్యక్షుడు గుర్బంగులీ బెర్డిముఖమెదోవ్ కు శునకాలంటే ఎంతో ప్రేమ. మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన అరుదైన అలబాయ్ జాతి కుక్కలను ఆయన అమితంగా ఇష్టపడతారు. అందుకే ఆ కుక్క జాతి గుర్తుగా బంగారు విగ్రహం చేయించారు. దేశ రాజధాని యాష్గబట్ లో ఓ ప్రసిద్ధ కూడలిలో ఆ అలబాయ్ కుక్క స్వర్ణ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు గుర్బంగులీ విగ్రహావిష్కరణ చేసి ఆ జాగిలం పట్ల తన మక్కువ చాటుకున్నారు. కాగా, విగ్రహం కింది భాగంలో ఓ ఎలక్ట్రానిక్ తెర కూడా ఏర్పాటు చేశారు. దానిపై అలబాయ్ జాతి కుక్కలకు చెందిన వీడియోలు చూడొచ్చు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/