శ్రీవారి హుండీ ఆదాయం రూ 1.19 కోట్లు
స్వామివారిని దర్శించుకున్న11,210 మంది భక్తులు

Tirumala: తిరుమల వెంకన్న స్వామివారికి శుక్రవారం హుండీ ఆదాయం రూ 1.19కోట్లు లభించింది. స్వామివారిని 11,210 మంది భక్తులు దర్శించుకున్నారు.స్వామివారికి 5,002 మంది తలనీలాలు సమర్పించారు. ఇదిలావుండగా, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ తాత్కాలికంగా నిలిపి వేశారు.. ప్రతి ఒక్కరూ తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని అధికారులు కోరారు. కాగా, కోవిడ్ ప్రభావం నేపథ్యంలో ఏప్రిల్ 12 వతేది నుండి సర్వదర్శనం టోకెన్ జారీ ప్రక్రియ నిలుపుదల చేసిన విష్యం తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/