టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసు..మరో ఇద్దరు అరెస్ట్

tspsc-sit-arrests-two-more-in-tspsc-paper-leak-case

హైదరాబాద్ః టీఎస్‌పీఎస్‌సీ కేసులో మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. వికారాబాద్ ఎంపీడీలో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్ అతడి తమ్ముడు రవికుమార్ ను సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో రేణుక భర్త డాక్యా నాయక్ నుంచి భగవంత్ కుమార్ తన తమ్ముడు రవికుమార్ కోసం ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. డాక్యానాయక్ బ్యాంకు ఖాతాలో జమ అయన అనుమానాస్పద లావాదేవీల విచారణలో ఈ విషయం బయటపడింది. డాక్యానాయక్ వద్ద రెండు లక్షలకు ఏఈ పేపర్ కొనుగోలు చేశారని చెప్పారు. ఈకేసులో ఇప్పటికే 33 లక్షలకు పైగా లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఈ కేసులో టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ ను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటికే ఈ కేసులో సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మిని విచారించింది ఈడీ. శంకర్ లక్ష్మితో పాటు పేపర్ లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సత్యానారాయణ స్టేట్ మెంట్ ను తీసుకుంది ఈడీ. కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితుల స్టేట్ మెంట్ ను తీసుకున్నారు ఈడీ అధికారులు