తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్ ఈ ఫలితాలను మంగళవారం ఉదయం విడుదల చేసారు. ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా.. ఫస్టియర్‌లో 2,94,378 మంది, సెకండియర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు.

రెగ్యులర్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. నేడు ఈ అడ్వాన్డ్స్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. ఇక ఈరోజు సాయంత్రం వెబ్సైట్ లో మొదటి సంవత్సరం ఫలితాలు రిలీజ్‌ కానున్నాయి. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం లో రెగ్యులర్ సప్లిమెంటరీ కలిపి 80.80 శాతం ఉత్తీర్ణత సాధించారని ఇంటర్ కమిషనర్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు.