గంగుల కమలాకర్ కు హైకోర్టులో భారీ ఊరట

TS Minister Gangula Kamalakar
ts-high-court-gives-relief-to-gangula-kamalakar

హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల కమిషన్ విధించిన పరిమితికి మించి 2018 ఎన్నికల్లో గంగుల ఖర్చు చేశారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ లో పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో, ఎన్నికల సమయంలో గంగులకు భారీ ఊరట లభించినట్టయింది.