అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు జరపాలని కేసీఆర్ ఆదేశం

రెబెల్ స్టార్ కృష్ణం రాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రేపు సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న కృష్ణం రాజు..హైదరాబాద్ లోని AIG హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం విషమించడం తో ఈరోజు ఉదయం కన్నుమూశారు. కృష్ణం రాజు మృతి పట్ల హాస్పటల్ వర్గం క్లారిటీ ఇచ్చింది.

“కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ వల్ల చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశాం. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు” అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.