టిక్‌టాక్‌ నిషేధంపై ట్రంప్‌ సంతకం

45 రోజుల గడువు విధించిన ట్రంప్

trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ లాంటి చైనా యాప్స్ ను నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. టిక్ టాక్ అలాగే ఇతర చైనీస్ యాప్స్ జాతీయ భద్రతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించాయని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమల్లోకి వస్తుందని ట్రంప్ గురువారం సంతకం చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గడువు తరువాత బైట్ డ్యాన్స్ లిమిటెడ్ తో అన్ని రకాల లావాదేవీలనూ నిషేధిస్తున్నట్టు ఆదేశించారు. కాగా, చైనాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో, ఇంతవరకూ సుంకాలను పెంచుతూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు, ఇటీవలే టిక్ టాక్ యాప్ ను యూఎస్ లో నిషేధిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆపై మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ యూఎస్ యూనిట్ ను సొంతం చేసుకునేందుకు పావులు కదపడం ప్రారంభించిందన్న వార్తలు కూడా వెలువడ్డాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/