అది ఒక తప్పుడు కథనం

ట్రంప్‌ వ్యాఖ్య

trump
trump

నూయార్క్‌: అమెరికాలో కరోనా వ్యాప్తి విజృంభణకు దేశ అధ్యక్షుడే కారణమంటూ ది న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనాన్ని ట్రంప్‌ తప్పుుపట్టారు. ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు.

అదో చిత్తు కాగితంతో సమానం. చైనాపై నిషేదాన్ని ప్రకటించినపుడు నేను వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని అన్నారు. గతంలో చాలా మంది ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నవారే అంటూ మండిపడ్డారు.

కాగా కరోనా ప్రారంభంలో అమెరికా ఇంటలిజెన్స్‌తో పాటు ప్రముఖ విభాగాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధ్యక్షుడిని హెచ్చరించినా ఆయన పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అమెరికా ఈ స్థితిలో ఉంది అని ఆ పత్రిక ప్రచురించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/