చైనాతో చేసుకున్న ఒప్పందంపై అభిప్రాయం మారింది

చైనా వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది

TRUMP, JINPING

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనాపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి విషయంలో చైనా వ్యవహరించిన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోందని తెలిపారు. చైనాతో మూడు నెలల క్రితం కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ఇప్పుడు తన అభిప్రాయం భిన్నంగా ఉందని చెప్పారు. కరోనా ఇతర ప్రాంతాలకు వ్యాపించే వరకు చైనా ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

వుహాన్ దాటకుండా కరోనాను నిలువరించగలిగిన చైనా అమెరికాతో ఇతర దేశాలకు పాకకుండా మాత్రం ఎందుకు ఆపలేకపోయిందని ఆయన నిలదీశారు. ఇలా ఎందుకు జరిగింద అని ప్రశ్నించారు. చైనాలోని ఇతర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి జరగలేదని ఆయన గుర్తు చేశారు. కాగా, కరోనా సంక్షోభం ముగిసిన అనంతరం చైనాతో వ్యవహరించే తీరు కఠినంగా ఉండాలని తమ ప్రభుత్వంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. కరోనా సమాచారాన్ని దాచి పెట్టి ప్రపంచ దేశాలపైకు ఆ వైరస్‌ను పంపిందని అంటున్నారు. దీని అమెరికాలో భారీగా ప్రాణ నష్టం సంభవించిందని చెబుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/