మే 1 వచ్చింది..కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంచింది

Commercial LPG cylinders
Commercial LPG cylinders

ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు సామాన్యులకు దడ పుడుతుంది. ఏ వస్తువుల ధరలు ఎంతెంత పెరుగుతాయో..అని వణికిపోతున్నారు. ముఖ్యంగా గ్యాస్ వినియోగదారులైతే ఒకటి వస్తుందంటే వామ్మో అంటూ ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈరోజు మే 1 వచ్చింది. అంత భావించినట్లే గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా మరోసారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ పై రూ.104 పెందాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563కు పెరిగింది. విశాఖలో రూ.2413, విజయవాడలో రూ.2501 కు చేరాయి. ఢిల్లీలో రూ.2355కు చేరింది.

ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ఇక ఇళ్లలో ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం పెంచలేదు. చివరి సారిగా మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ రేటును రూ.50 పెంచారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1,002గా కొనసాగుతోంది. కాగా, చిన్న గ్యాస్‌ సిలిండర్‌ (5కేజీలు) ధర రూ. 655గా కొనసాగుతోంది.

గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.104 పెంచి సామాన్య ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ చర్యలు, నిర్ణయాలు ప్రజా జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టుతున్నాయన్నారు.