వైట్ హౌస్ వద్ద ట్రక్కు బీభత్సం

భద్రతా సిబ్బంది అదుపులో డ్రైవర్‌

Truck crashes into security barriers near White House

వాషింగ్టన్ః వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ సమీపంలోని లాఫేట్ స్క్వేర్‌ వద్ద ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి దూసుకొచ్చిన ఓ ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు.

బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించినట్టు ‘ఫాక్స్ 5’ టెలివిజన్ న్యూస్ తెలిపింది. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని గుర్తించారు.