ఈనెల 19న మునుగోడు లో టీఆర్ఎస్ బహిరంగ సభ..?

ఈనెల 19న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగబోతుండడం తో అన్ని పార్టీ లు ఉప ఎన్నికపై కసరత్తులు మొదలుపెడుతున్నాయి. బిజెపి నుండి రాజగోపాల్ బరిలోకి దిగుతుండడం తో విజయం ఫై ధీమా వ్యక్తం చేస్తుంది బిజెపి. మరోపక్క కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు ఫై ధీమాగా ఉన్నారు. ఈ తరుణలో టిఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తోంది.

గురువారం సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక‌పై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తో కేసీఆర్ చర్చించారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని బరిలో దింపితే గెలుస్తారు..? ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి..? అనే వివరాలపైనా ఆరా తీశారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి కష్టపడి పని చేయాలని, తప్పనిసరిగా మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేయాలని నాయకులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఈ నెల 19 న మునుగోడు లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ఈనెల 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు. అయితే.. బీజేపీ సభ కంటే ముందే సభ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.