రాజగోపాల్ ను ఇకనుండి అలాగే పిలువాలంటున్న రేవంత్ ..

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఘాటైన విమర్శలు చేసారు. మునుగోడు అసెంబ్లీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ శ్రేణుల‌తో గురువారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్‌ల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఉప ఎన్నిక‌ల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అనంత‌రం రాజ‌గోపాల్ రెడ్డి తీరుపై సెటైర్లు సంధించిన రేవంత్ రెడ్డి… ఇక‌పై రాజ‌గోపాల్ రెడ్డిని ఆర్‌జీ పాల్ అని పిల‌వాల‌ని పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ఇప్ప‌టిదాకా మ‌న‌కు కేఏ పాల్ మాత్ర‌మే ఉన్నార‌ని, ఇక‌పై కేఏ పాల్‌కు మ‌న ఆర్‌జీ పాల్ కూడా తోడ‌య్యార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 13 న మునుగోడు లో రేవంత్ పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

మన మునుగోడు మన కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకుని ముందుకెళ్తుంది.గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మునుగోడుకెళ్లాలని హస్తం పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 నుంచి 30 వరకు నేతలు మునుగోడులో పర్యటించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెంపుపైనే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ గా చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. కులాలు, వృత్తుల వారీగా అనుబంధ సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. అమిత్ షా సభకు పోటీగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.