రాధే శ్యామ్ నుండి ‘సంచారి ఛల్‌ ఛలో’ సాంగ్ వచ్చేసింది..లొకేషన్స్ మాములుగా లేవు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – గోల్డెన్ బ్యూటీ పూజా హగ్దే జంటగా రాధా కృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్’. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో చిత్రంలోని సాంగ్స్ ఒక్కోటిగా విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. ఈ క్రమంలో గురువారం ‘సంచారి’ అనే మూడో పాటను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.

‘కొత్త నేలపై కాలి సంతకం.. కొండ గాలితో శ్వాస పంపకం.. సంచారి ఛల్ ఛలో’ అంటూ సాగిన ఈ పాట వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. జీవితంలో నిజమైన ప్రేమ దొరికే ప్రదేశం కోసం అన్వేషిస్తున్న యువకుడిగా ప్రభాస్ కనిపించారు. నచ్చిన ప్రతీ అమ్మాయికి ప్రపోజ్ చేస్తూ లవర్ బాయ్ గా హ్యాండ్సమ్ లుక్ లో ప్రభాస్ ఆకట్టుకున్నాడు.

యూరప్ వీధుల్లో అందమైన లొకేషన్స్ లో ‘సంచారి’ పాటను చిత్రీకరించారు. ప్రభాస్ ఇందులో మంచు పర్వతాలలో స్కేటింగ్ చేస్తూ.. ఆకాశంలో డైవింగ్ చేస్తూ కనిపించారు. అలానే కార్ డ్రైవింగ్ – సైక్లింగ్ – హోర్స్ రైడింగ్ చేసి ఆకట్టుకున్నారు. జస్టిన్ ప్రభాకర్ దక్షిణాది బాషల్లో ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. తెలుగులో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఆలపించగా.. కృష్ణకాంత్ (కెకె) దీనికి సాహిత్యం అందించారు.

వింటేజ్‌ లవ్‌స్టోరి ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజాహెగ్డే ప్రేరణ పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకి రానుంది.

YouTube video