బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిబంధనలు కఠినతరం

వేగం యాభై దాటితే జరిమానా తప్పదంటున్న పోలీసులు

Rules on Biodiversity Flyover
Rules on Biodiversity Flyover

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో గల బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలను కఠనతరం చేశారు. 50కి మించి వేగంగా వెళ్లకూడదని పోలీసులు స్పష్టం చేశారు. వేగం గంటకు 50 కిలోమీటర్లు దాటితే జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఓ వ్యక్తికి 58 కిలోమీటర్ల వేగంతో వెళ్లినందుకు ఫైన్‌ వేశారు. ఫైఓవర్‌పై గంటకు 70 నుంచి 80 వేగంతో వెళ్తున్నారని గమనించి పోలీసులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. గతంలో 70 దాటితే వెయ్యి రూపాయలు జరిమానా, ఇప్పుడైతే యాభై దాటినా ఫైన్‌ పడుతుంది. అంతేకాకుండా లేన్ల(వరుసలు) డివైడర్‌ లైన్‌ దాటినా జరిమానా విధిస్తున్నారు. వంతెనపై సెల్ఫీలు, ఫోటోలకు అనుమతి లేదని పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/