తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ బుధవారం ఉదయం విడుదల చేసింది. ఫిబ్రవరి నెల కోటా టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచింది. రోజుకు 20 వేల టికెట్ల చోప్పున 17 స్లాట్లలో రూ.300 టికెట్లను టీటీడీ విడుదల చేసింది. ఒక యూజర్ ఐడీ నుండి ఆరు టికెట్ల బుక్ చేసుకునే సందుపాయం ఉంది. టీటీడీ దేవస్థానం అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో ఎక్కడి నుంచైనా కొనుగోలు చేసుకోవచ్చు.
దర్శన టికెట్లతో పాటు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలోని గదుల బుకింగ్ కోటాను కూడా విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా కారణంగా టికెట్ కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు టీడీపీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/