విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను ఢీ కొట్టిన టిప్పర్

విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా విద్యార్థులకు గాయాలయ్యాయి. గజపతినగరం మండలం, బోడసింగిపేట సమీపంలో సెంచూరియన్ యూనివర్సిటీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సీట్‌లోనే గాయలతో ఇరుక్కుపోయాడు. బస్సులో ఉన్న విద్యార్థులకు సైతం గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నారు. అతికష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన లారీని తొలగించి డ్రైవర్‌ను కాపాడి బయటకు తీశారు. ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గజపతినగరం హాస్పటల్ లో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.