హ‌జ్ యాత్రికుల విష‌యంలో సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

మ‌గ‌తోడు లేకుండానే మ‌హిళ‌లు హ‌జ్ యాత్ర చేసుకోవ‌చ్చు.. సౌదీ

రియాధ్‌: హ‌జ్ యాత్రికుల విష‌యంలో సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ‌ల‌కు హజ్‌యాత్ర‌కు అనుమ‌తించిన సౌదీ.. మ‌గ‌తోడు లేకుండానే యాత్ర‌కు రావొచ్చ‌ని పేర్కొంది. పురుషుల‌పై ఆధార‌ప‌డ‌కుండా సొంతంగా మ‌హిళ‌లే యాత్ర కోసం త‌మ పేర్లు రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హ‌జ్ అండ్ ఉమ్రా వెల్ల‌డించింది. “దేశీయ మ‌హిళ‌లు ఎవ‌రైతే హ‌జ్ యాత్ర‌కు రావాల‌నుకుంటున్నారో వారు మ‌గ‌తోడు లేకున్నా త‌మ పేర్లను సొంతంగా న‌మోదు చేసుకోవ‌చ్చు. మ‌రో మహిళ‌తో క‌లిసి హ‌జ్‌కు రావొచ్చు” అని మినిస్ట్రీ ఆఫ్ హ‌జ్ అండ్ ఉమ్రా ట్వీట్ చేసింది.

కాగా, సౌదీ అరేబియా స‌ర్కార్ మ‌హ‌మ్మారి క‌రోనా నేప‌థ్యంలో గ‌తేడాదిలాగే ఈసారి కూడా దేశ‌ నివాసితుల‌కు అది కూడా కేవ‌లం 60వేల మందికి మాత్ర‌మే హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తించిన విష‌యం తెలిసిందే.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/