ఉత్తరాఖండ్ కు మూడు రాజధానులు!

మూడు రాజధానుల ప్రకటన చేసిన సిఎం త్రివేంద్ర సింగ్ రావత్

Trivendra Singh Rawat
Trivendra Singh Rawat

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌ ఇకనుండి ఏపి బాటలో నడుస్తుంది. ఉత్తరాఖండ్‌లో కూడా మూడు రాజధానులు ఉంటాయని ఆ రాష్ట్ర సిఎం, బిజెపి నేత త్రివేంద్ర సింగ్‌ రావత్‌ బడ్జెట్‌ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిగా డెహ్రాడూన్, న్యాయ రాజధానిగా నైనితాల్ ఉండగా, ఇకపై వేసవి రాజధానిగా గైర్సైన్ ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో ఉత్తరాఖండ్ సైతం మూడు రాజధానులతో విలసిల్లనుంది. ఇక మూడు రాజధానుల నిర్ణయంపై అసెంబ్లీలో మరింత వివరణ ఇచ్చిన త్రివేంద్ర సింగ్ రావత్, పర్వత ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గైర్సైన్ ను క్యాపిటల్ చేయాలని తాను కూడా పోరాడానని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు గౌరవం ఇచ్చే సమయం ఆసన్నమైందని, ఇకపై వేసవిలో తాను అక్కడే మకాం వేసి, పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/