మధురానగర్‌లో వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ

ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు

Theft at the home of a diamond merchant
Theft at the home of a diamond merchant

Hyderabad: నాగోల్‌ – మధురానగర్‌లో వజ్రాల వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ. 40 లక్షలు విలువైన వజ్రాలను, జాతిరత్నాలను అపహరించారని బాధితుడు శుక్రవారం ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధురానగర్‌కు చెందిన మురళీకృష్ణ సిటీలో 3 చోట్ల వజ్రాలు, జాతిరత్నాల విక్రయ దుకాణాలు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 10న ముంబై నుంచి రూ. 1.2 కోట్ల విలువైన వజ్రాలు, జాతిరత్నాలు తీసుకు వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు, క్లూస్‌ టీం ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా , ఈ నెల 15న చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిసింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/