పాత్రికేయుల కృషి అభినందనీయం

చిలకలూరి పేట ఎమ్మెల్యే రజని ప్రశంస

MLA Rajani-
MLA Rajani-

Chilakaluri pet: విలేక‌రులు, వారి కృషి స‌మాజానికి శ్రీరామ ర‌క్ష లాంటిద‌ని చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే  విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.

క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో పాత్రికేయులు చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడారు.

చిల‌క‌లూరిపేట‌లోని అడ్డ‌రోడ్డు సెంట‌ర్‌లో ఉన్న త‌న కార్యాల‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోని పాత్రికేయులంద‌రికీ గురువారం ఎమ్మెల్యే త‌న సొంత నిధుల‌తో బియ్యం, నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ చేశారు.

దాదాపు వంద మంది విలేక‌రుల‌కు ఒక్కొక‌రికి ఒక బియ్యం బ‌స్తా, ఆరుకేజీల కూర‌గాయ‌లు, కేజీ కందిప‌ప్పు, కేజీ ఉల్లిపాయ‌లు, కేజీ గోధుమ‌పిండి, కేజీ పంచ‌దార‌, రుచిగోల్డు స‌న‌ఫ్ల‌వ‌ర్ ఆయిల్  ప్యాకెట్ ఒక‌టి అంద‌జేశారు. 

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/