పశ్చిమ గోదావరిలో కాంగ్రెస్ నేతల ఆందోళన

పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో ఏపి కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. రాజ్యాంగ బద్ధంగా వచ్చిన ఎస్సి, ఎస్టి రిజర్వేషన్ లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతూ… ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు శైలజానాధ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/