పాలకుల ఆలోచనా విధానం మారాలి!

దేశం అభివృద్ధి దిశలో పయనించాలంటే మార్పు రావాల్సిందే.

Political Leaders

ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించి రాజ్యాంగంలోని లొసుగులనుపయోగించుకుంటూ అవినీతికి, పక్షపాతానికి, అసమానత్వానికి, స్వార్థపూరిత పాలనకు అడ్డుకట్ట వేయకుండా ఎలాంటి పాలనగావించినా, ఎన్ని ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోకుండాపోతామే తప్ప మరొకటి లేదు. మార్పుకోసం నిస్వార్థంగా పనిచేసేవారికి మనుగడ లేకుండాపోయింది. కావ్ఞన పాలకుల ఆలోచనా విధానాన్ని మార్చ లేకపోతున్నామన్నది నూటికినూరుపాళ్లు సత్యం. దేశం అభివృద్ధి దిశలో పయనించాలంటే మార్పు రావాల్సిందే.

ప్ర పంచంలో ఎన్నో దేశాలు 19వ శతాబ్దంలోనే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది, అభి వృద్ధి దిశలో పయనిస్తే, మరికొన్ని చిన్న చిన్న దేశాలు ఆలస్యంగా స్వాతంత్య్రాన్ని సముపార్జించుకొని, అతి తక్కువ సమయంలోనే అభి వృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్లిన సందర్భాలను చవిచూశాం. కానీ మన భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడుతుందో అర్థంకాని స్థితిలో ఉన్నామంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అసలు అభివృద్ధి ఎలాగుంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? లాంటి విషయాలను చూస్తే ముమ్మాటికీ పాలకుల చేతిలోనే ఉంటుందని అందరికి తెలిసిన విషయమే.

అలాగే దేశంలోని ప్రతి ఒక్కరు వారి బాధ్యతను, విధులను సక్రమంగా నిర్వర్తించినప్పుడే అది సాధ్యపడటానికి ఆస్కార ముంటుంది. కానీ మన ప్రజాస్వామిక దేశంలో ఎన్నికైన పాలక వర్గం, తమ ఆలోచన జ్ఞానాన్ని ఎక్కువ శాతం తమ పదవ్ఞలను కాపాడుకోవడానికో, వచ్చే ఎన్నికలలో గెలిచి, తమ స్థానాలను సుస్థిరంగా ఏర్పర్చుకుంటూ తమ ఆర్థికాభివృద్ధికే పాటుపడుతూ ఉంటారు. వారు తలపెట్టే అభివృద్ధి కార్యక్రమాల ఫలితం సైతం ఆశించిన రీతిలో పొందకపోగా, కొన్ని చోట్ల అభివృద్ధి అనేది కాగి తాలలో కనిపిస్తుంది.

కానీ వాస్తవికంగా కనిపించని పరిస్థితులు ఏర్పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అభివృద్ధి కార్యక్రమాలనేది ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ప్రణాళికబద్ధంగా అమలుపరుస్తూ, ముందుకు వెళ్లి ఆ పనిని విజయవంతం చేసినప్పుడే ఆశించిన ఫలితాలను చూసే అదృష్టం లభిస్తుంది. కానీ మధ్యలో ప్రభు త్వాలు మారినప్పుడు ఒకరిపై మరొకరు నిందలు మోపుకుంటూ ఆయా అభివృద్ధి కార్యక్రమాలలో సైతం పలుమార్పులు చేస్తూ వీలైతే దానివల్ల ఎలాంటి లాభం లేదనే ఉద్దేశ్యంతో రద్దు చేస్తూ నూతనంగా మరో అభివృద్ధి కార్యక్రమాలను చేబడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం మూలంగా అనుకున్నంత రీతిలో అభివృద్ధి చెందకపోవడమనేది ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.

దేశంలోని విభిన్న రాష్ట్రాల్లో రకరకాల పార్టీలకు చెందినవారు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, నిస్వార్థంగా, నిస్పక్షపాతంగా అమలుపరిచినప్పుడు అనుకున్న ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మిగతా అన్ని రాష్ట్రాలలో జరుగుతూ, దానికై కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం లభించినప్పుడు అభివృద్ధి దిశలో పయనించిన వారవ్ఞతారు.

కానీ రాష్ట్రాలు దేశంలో ఒక పార్టీకి చెందినవారో, లేదా తమ కూటమికి చెందిన పాలకులుంటే ఒకరకంగా, వేరే ఇతర పార్టీలకు చెందిన పాలకులు, తమ కూటమికి వ్యతిరేకవర్గ పాలకులైతే కేంద్రం నుంచి లభించే సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలలో భిన్న మార్పులుంటాయన్నడంలో ఎలాంటి అబద్ధం లేదు. రాష్ట్రాలలో కానీ, దేశంలో కానీ ప్రభుత్వాలు చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమైనా దాని నుండి తమ అనుచరులకో, తమకో, తమని నమ్ముకున్న వారికో లేదా తమ ప్రభుత్వాన్ని స్థిరంగా ఏర్పర్చుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నాయి.

ప్రణాళికబద్ధంగా అందరికి ఉపయోగపడుతూ దేశాభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను ఎంచుకోని చేపట్టినప్పుడే శుభఫలితాలను పొందడానికి ఆస్కారముంటుంది. కానీ అలాంటి కార్యక్రమాలు చాలా తక్కువగానే ఉంటాయనొచ్చు. ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని తీసుకుంటే వారు తలపెట్టే ఏ కార్యక్రమానికైనా ప్రజాధనాన్నే వాడవలసి ఉంటుంది.

అలాంటప్పుడు పక్షపాత ధోరణిని అవలంబించకుండా, సమానత్వంతో, అర్హత కలిగిన వారందరికీ పార్టీలకతీతంగా అవకాశాలు కల్పించడమనేది చాలా అరుదనే చెప్పొచ్చు. ఎందుకంటే పరిపాలన యంత్రాంగమనేది గ్రామస్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర, కేంద్రస్థాయి వరకు విభిన్న విధాలుగా ఉన్నా ఒకే పార్టీకి చెందిన వారయితే వారి మధ్యసమన్వయ సంబంధాల కారణంగా గ్రామనాయకులకు ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా ప్రయోజనాలను చేర వేయాలో, దానివల్ల కలిగే ఫలితాలేంటో బాగా తెలుసు.

ఇదంతా రాజ్యాంగ బద్ధంగా సరైందికాదు అని నిరూపించడానికి సైతం ఎలాంటి ఆధారాలు కూడా ఉండవ్ఞ. కానీ ఎక్కువ శాతం ఇలాగే జరుగుతున్నది. అందరికి తెలిసిన ఒక చిన్న ఉదాహరణను పరిశీలిస్తే ఒక చిన్న వార్డుమెంబర్‌ నుండి ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి వరకు ఎన్నికలలో ఎలా డబ్బులు ఖర్చుపెట్టి గెలుస్తారో, ఎలా మద్యాన్ని ఏరులైపారిస్తారో, ఎలాంటి బహుమతులను పంచుతారో, అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో కనిపించేటటు వంటి ఆధారాలు చూస్తే అర్థంకాకమానదు. ఇంత మోతాదులో డబ్బులు ఖర్చుపెట్టి గెలిచి ఉచితంగా సేవలందించడానికి మహా నుభావ్ఞలు ఎవ్వరులేరు.

ప్రస్తుత తరుణంలో ప్రతిదానిని వ్యాపార దృక్పథంతో చూసే నేడు ఖర్చుపెట్టిన దానికంటే కొన్ని రెట్లు అధిక సొమ్మును ఆశించే మార్గాలను ఎంచుకోవడం, ఆచరణలో అమలు పరుస్తారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.ఎవ్వరి అధికారం శాశ్వతం కానప్పుడు, తమకనుకూలంగా ఉన్నవారిని అసమర్థతను, అవినీతిని, కాపాడుకోలేనప్పుడు అధికారంలో ఉండి ఏం చేసినట్లు అనేలా ఆలోచిస్తున్నారే తప్ప దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత అవలంబిస్తున్న తీరు, తప్పు చేశారని నిరూపణ జరిగిన తర్వాత సైతం కప్పిబుచ్చే ప్రయత్నం చేయడం, ఇలాంటి ఎన్నో విషయాలను పరిశీలిస్తుంటే దేశం కోసం,దేశాభివృద్ధికోసం

, క్షేమం, సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాలున్నాయంటే నమ్మకం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రసుత్తం దేశాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. సమాజశ్రేయస్సుకోసం పాటుపడే వ్యక్తులు, వర్తమానంలో జరుగుతున్న వాస్తవిక పరిణామాలను వెలుగులోకి తేవడానికి, ప్రజలకు తెలియచేయడానికి చేసే ఎలాంటి ప్రయత్నం చేసినా ఏవో కారణాలను చూపి తమ అధికార బలంతో అసత్యపు ఆరోపణలు చేయడం,

అరెస్టులు చేయడం లాంటి విషయాలను చూస్తుంటే అందరికి ఏం జరుగుతుందో అర్థమయినా ఏమీ చేయ లేని పరిస్థితిల్లో మేధావ్ఞలుండిపోతున్నారంటే ఈ ప్రపంచీకరణలో మనం ఎటువైపు పయనిస్తున్నామో అర్థంకాక మానదు. ప్రజాస్వా మ్యాన్ని పక్కదారి పట్టించి రాజ్యాంగంలోని లొసుగులనుపయోగిం చుకుంటూ అవినీతికి, పక్షపాతానికి, అసమానత్వానికి, స్వార్థపూ రిత పాలనకు అడ్డుకట్ట వేయకుండా ఎలాంటి పాలనగావించినా, ఎన్ని ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోకుండా పోతామేతప్పా మరొకటి లేదు.

మార్పుకోసం నిస్వార్థంగా పనిచేసేవారికి మనుగడ లేకుండాపోయింది. కావ్ఞన పాలకుల ఆలోచనా విధానాన్ని మార్చ లేకపోతున్నామన్నది నూటికినూరుపాళ్లు సత్యం. దేశం అభివృద్ధి దిశలో పయనించాలంటే మార్పు రావాల్సిందే. ముందుగా ప్రజల్లో అంటే ఓటువేసే వారిలో. ఇప్పటికైనా ప్రతిఒక్కొరు ఆలోచించాల్సిన తరుణం ఆసన్న మైంది. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం ఇంతటా ఆవిర్భవించాక సైతం ఎక్కడ ఏమీ జరిగినా తక్షణమే అరచేతిలో చూస్తున్నా చలించడం లేదన్నది వాస్తవం. ఇకనైనా అందరిలో మార్పురావాలి.

త్తం దేశాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. సమాజశ్రేయస్సుకోసం పాటుపడే వ్యక్తులు, వర్తమానంలో జరుగుతున్న వాస్తవిక పరిణామాలను వెలుగులోకి తేవడానికి, ప్రజలకు తెలియచేయడానికి చేసే ఎలాంటి ప్రయత్నం చేసినా ఏవో కారణాలను చూపి తమ అధికార బలంతో అసత్యపు ఆరోపణలు చేయడం,

అరెస్టులు చేయడం లాంటి విషయాలను చూస్తుంటే అందరికి ఏం జరుగుతుందో అర్థమయినా ఏమీ చేయ లేని పరిస్థితిల్లో మేధావ్ఞలుండిపోతున్నారంటే ఈ ప్రపంచీకరణలో మనం ఎటువైపు పయనిస్తున్నామో అర్థంకాక మానదు. ప్రజాస్వా మ్యాన్ని పక్కదారి పట్టించి రాజ్యాంగంలోని లొసుగులనుపయోగిం చుకుంటూ అవినీతికి, పక్షపాతానికి, అసమానత్వానికి, స్వార్థపూ రిత పాలనకు అడ్డుకట్ట వేయకుండా ఎలాంటి పాలనగావించినా, ఎన్ని ఏళ్లు గడిచినా అభివృద్ధికి నోచుకోకుండా పోతామేతప్పా మరొకటి లేదు.

మార్పుకోసం నిస్వార్థంగా పనిచేసేవారికి మనుగడ లేకుండాపోయింది. కావ్ఞన పాలకుల ఆలోచనా విధానాన్ని మార్చ లేకపోతున్నామన్నది నూటికినూరుపాళ్లు సత్యం. దేశం అభివృద్ధి దిశలో పయనించాలంటే మార్పు రావాల్సిందే. ముందుగా ప్రజల్లో అంటే ఓటువేసే వారిలో. ఇప్పటికైనా ప్రతిఒక్కొరు ఆలోచించాల్సిన తరుణం ఆసన్న మైంది. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం ఇంతటా ఆవిర్భవించాక సైతం ఎక్కడ ఏమీ జరిగినా తక్షణమే అరచేతిలో చూస్తున్నా చలించడం లేదన్నది వాస్తవం. ఇకనైనా అందరిలో మార్పురావాలి.

-పోలం సైదులు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/