కరోనాపై ప్రపంచ దేశాల ఉమ్మడి పోరు

పరిశుభ్రత, భౌతిక దూరం అవసరం

Coronavirus
Coronavirus

ఈ విశ్వంలో భూమి పుట్టుక ఒక అద్భుతం. జీవం పుట్టుకకు అన్ని అనుకూలతలు ఉన్న భూమిపై ఎన్నో జీవరాశులు పురుడుపోసుకున్నాయి.అలా పుట్టిన జీవులలో అత్యంత మేధస్సు తెలివితేటలు కలిగిన జాతి మానవ జాతి.

మనిషి పుట్టుక నుండి నేటివరకు నిత్యం ఏదో ఒక సమస్యతో పోరాడుతూ యుద్ధం చేస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నా డు. మానవుడు ఇంతవరకు రాజ్యాల కొరకు, తమ ఆధిపత్యాల కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు.

మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచయుద్ధంలో వేలమంది ప్రాణాలను కోల్పోయారు. ఇది మూడవ ప్రపంచ యుద్ధంమొదలైంది. ప్రపంచ మానవు లకు, కంటికి కనబడని అతి భయంకరమైన సూక్ష్మజీవి కరోనా వైరస్‌తో నిరంతరంగా కొనసాగుతున్న యుద్ధం.

ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రపంచం అంతం. ఈ యుద్ధంలో ఒకపక్క అన్ని దేశాలు ఉంటే మరొకపక్క కరోనా వైరస్‌! ఈ మహా యుద్ధంలో అన్ని దేశాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలకుపైగా మనుషుల్లో ఈ వైరస్‌ సంక్రమించి మరణాలు కూడా ఎక్కువగానే జరిగాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

అంటే ఈ వైరస్‌ తీవ్రత ఏస్థాయి లో వ్ఞందో మనకు అర్థం అవ్ఞతుంది. ఈ మహమ్మారి వైరస్‌ ఏరూపంలోఎలా వస్తుం దో?ఎలా అంతం అవ్ఞ తుందో?తెలియక ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు స్కూళ్లు,కాలేజీలు, ఉద్యో గులు, చిరువ్యాపారుల నుండి షాపింగ్‌ మాల్‌, సినిమా థియే టర్లు, దేవాలయాలు, చర్చిలు,మసీదులు, ఇలా అన్నిరకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు పూర్తిగా మూసివేసిన పరిస్థితి. అయిననూ ఈ మహమ్మారి కరోనా రోజురోజుకి రెట్టింపు వేగంతో విస్తరిస్తుంది.

అసలు అది ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మన కంటికి కనబడని శత్రువ్ఞ తో మనం యుద్ధం చేస్తున్నాం. ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నడూ ఇలాంటి విపత్తు చూడలేదు. అంతా నావాళ్లు ఏంకాదు అని అనుకుంటే వేలుకాదు లక్షల్లో మరణాలు ఉంటాయి అని మరవొద్దు.

కేంద్ర,రాష్ట్రాల ఆదేశాలు తూ.చ తప్పక పాటించాలి.మనవద్ద ఎలాంటి ఆయుధాలు లేవ్ఞ! మనకు తెలిసిందల్లా ఇంట్లో నుండి బయటకు వెళ్లకపోవడం, పరిశుభ్రం గా ఉండటం, రోగనిరోధక శక్తిని పెంచే సి,డి విటమిన్లు దొరికే కూరగాయలు, పండ్లు, పలహారాలు తీసుకోవడం, ఆరోగ్యంగా ఉండటం వలన ఈ వైరస్‌ను కొంతవరకు ఎదుర్కోవచ్చు.

ఈ మహాయుద్ధంలో అందరం ఒకటి అవ్వాలి. ఈ వైరస్‌ మీద పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. దేశంలోని నిరుపేదలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ వారిని చైతన్యం చేయాలి. ప్రజలందరూ గుమికూడకుండా, సామాజిక దూరం పాటించాలి. అప్పుడే ఈ మహమ్మారిని అరికట్టగలం.

  • పిల్లి కృష్ణ

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/