అల్లూరి జిల్లా AOB లో హై అలర్ట్..

అమరావతి: ఏపీలో అల్లూరి జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (AOB)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కటాఫ్ ఏరియా, సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు.
మంగళవారం ఒడిశాలోని నౌపాడ జిల్లా బోడెన్ బ్లాక్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/