ఆయన లేని లోటు పార్టీకి, సమాజానికి తీరని లోటు

నాయిని మృతికి సంతాపం ప్రకటించిన మంత్రి కెటిఆర్‌

nayini narsimha reddy – ktr


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మాజీ హోం మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి గత రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. నాయిని మృతికి మంత్రి కెటిఆర్‌ సంతాపం ప్రకటించారు. నాయిని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో సిఎం కెసిఆర్‌ వెంట నిలిచిన ఉద్యమ నేతగా, జన నాయకుడిగా, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా అందరి మనస్సుల్లో నిలిచిపోతారని కెటిఆర్‌ అన్నారు. ఆయన లేని లోటు పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫొటోలను ట్విటర్‌లో ఫొటోలు షేర్‌ చేశారు. ‘జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడని, మీ ఆత్మశాంతికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/