మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎస్కార్ట్‌ వాహనం ఢీకొన్న ఆటో

AP Minister A Suresh
AP Minister A Suresh

అమరావతిః ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ కాన్వాయ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఎస్కార్ట్‌ వాహనం అటుగా వెళ్తున్న ఒక ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాగా మృతి చెందిన వ్యక్తిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్‌గా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మంత్రి సురేశ్ ముందు వాహనంలో ఉన్నారు. మంత్రి విజయవాడ నుంచి మార్కాపురం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.