బీజేపీతో పొత్తు లేకపోతే పవన్ పోరాడలేరు – బీజేపీ నేత టీజీ వెంకటేశ్

రాబోయే ఎన్నికల్లో జనసేన పొత్తు ఎవరితో అనేది తెలియడం లేదు..ప్రస్తుతం బిజెపి తో పొత్తులోనే ఉన్నట్లు చెపుతున్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో మాత్రం టీడీపీ తో పొత్తు కొనసాగిస్తారని ప్రచారం జరుగుతుంది. బిజెపి , టీడీపీ , జనసేన మూడు పార్టీలు పొత్తు చేసుకుంటాయా..? లేక బిజెపి – జనసేన పొత్తు ఉంటుందా..? అనేది అర్ధం కావడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి నేతలతో సమావేశమవుతూ బిజీ , బిజీ గా ఉన్నారు.

ఈ తరుణంలో బీజేపీ నేత టీజీ వెంకటేశ్..జనసేన – బిజెపి పార్టీల పొత్తు స్పందించారు. వైస్సార్సీపీ తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొట్లాడాలంటే బీజేపీతో పొత్తు ఉండాలని ఉండాలన్నారు. బీజేపీతో పవన్ కలిసుంటే తమకు కూడా లాభమేనని చెప్పారు. బీజేపీ, జనసేనల పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందని అన్నారు.

భవిష్యత్ కార్యాచరణ గురించి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో పవన్ మాట్లాడి ఉండొచ్చని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయం గురించి కూడా మాట్లాడి ఉండొచ్చని అన్నారు. రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం పని అయిపోయిందనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని అన్నారు.