వామ్మో ఒక్క సాంగ్ కు రూ.15 కోట్లా..?

స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే కోట్లలో ఖర్చు చేయాల్సిందే. కేవలం పాటలకే భారీ ఎత్తున ఖర్చు చేస్తుంటారు. భారీ సెట్టింగ్స్ , విదేశాల్లో షూటింగ్ ఇలా భారీ ఎత్తున ఉంటుంది. ప్రస్తుతం చరణ్ తో చేస్తున్న మూవీ లో ఒక్క సాంగ్ కే దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడట. ప్రస్తుతం ఇదే ఫిలిం సర్కిల్లో అంత మాట్లాడుకుంటున్నారు. శంకర్ – రామ్ చరణ్ కలయికలో RC15 పేరిట ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తుండగా , కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే సముద్రఖని , శ్రీకాంత్ , అంజలి , ఎస్ జె సూర్య తదితరులు పలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా, తాజాగా కొత్త షెడ్యూల్ ను న్యూజిలాండ్ లో మొదలుపెట్టారు. ఇక్కడ ఓ అందమైన సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. దాదాపు 12 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఒక్క పాటను 15 కోట్ల బడ్జెత్ తీస్తున్నారన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు సినిమాపై హైప్‌ను మరింత పెంచుతుంది.మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ తో పాటు శంకర్ భారతీయుడు 2 కూడా చేస్తున్నాడు.