తెలుగు రాష్ట్ర ప్రజలను ఖంగారు పెట్టిస్తున్న Ay12 వేరియంట్

గత రెండేళ్లుగా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి..కొత్త వేరియంట్ లలో మారుతూ డాక్టర్స్ కు సవాల్ విసురుతుంది. ఇప్పటికే పలు కొత్త వేరియంట్ లలో దాడి చేసిన ఈ మహమ్మారి..ఇప్పుడు Ay12 వేరియంట్ మనుషుల ప్రాణాలు తీస్తుంది. డెల్టా ప్ల‌స్ వేరియంట్ నుండి ఏవై 12 అనే వేరియంట్ పుట్టుకుని వ‌చ్చింది. ఈ వేరియంట్ డెల్టా ప్ల‌స్ వేరియంట్ కంటే వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే ఈ వేరియంట్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది.

ఆగ‌స్టు 30న మొదటి వేరియంట్ ఉత్త‌రాఖండ్ లో వెలుగు చూసింది. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 18, తెలంగాణ లో 15 కేసులు న‌మోద‌య్యాయి. కేవ‌లం వారంలోనే ఈ వేరియంట్ తెలుగు రాష్ట్రాల‌కు విస్త‌రించిందంటే వైర‌స్ వ్యాప్తి ఏ స్పీడ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ కేసుల నమోదులో ఉత్తరాఖండ్‌తో కలిసి ఏపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో కొత్తరకం వైరస్‌ పట్ల అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను ర్యాండమ్‌ పద్ధతిలో పరీక్షించినప్పుడు ఏవై.12 కేసులు బయటపడ్డాయి.