నగరంలో రూ.100 దాటిన పెట్రోల్ ధర

హైదరాబాద్: నగరంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తూనే ఉన్నాయి. తాజాగా సోమవారం పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెంచాయి. పెట్రోల్, డీజిల్ పై మరో 29 పైసల నుంచి 31 పైసలు పెంచాయి. దీంతో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రికార్డు నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మీద 20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 14 పైసలకు చేరుకుంది.

ఇక జిల్లాల వారీగా పెట్రోల్ ధరలు చూసినట్లయితే.. కరీంనగర్ లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల 7 పైసలు ఉంది. ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోనూ లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అత్యధికంగా 101 రూపాయల 20 పైసలు ఉంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/