‘దిశ రేప్​’ ఘటన : రవితేజ, అల్లు శిరీష్ ల ఫై కేసు నమోదు

'దిశ రేప్​' ఘటన : రవితేజ, అల్లు శిరీష్ ల ఫై కేసు నమోదు

తెలుగు రాష్ట్రాలతోపాటూ… దేశం మొత్తాన్నీ దిశ రేప్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన కు పాల్పడిన నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. తాజాగా ‘దిశ రేప్​’ ఘటనకు సంబంధించి సినీ ప్రముఖుల ఫై కేసులు నమోదు కావడం ఇప్పుడు వైరల్ గా మారింది. అత్యాచార బాధితురాలి పేరును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారంటూ వారిపై ఫిర్యాదు చేశారు అడ్వకేట్ గౌరవ్ గులాటీ. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ నటుడు రవితేజ, నటి రకుల్​ ప్రీత్ సింగ్, అల్లు శిరీష్ సహా 38 మందిపై కేసు నమోదైంది. వీరిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గౌరవ్ గులాటీ దిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్​గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ సహా టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, నటి ఛార్మి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక దిశ ఘటన విషయానికి వస్తే..2019 నవంబర్‌ 27. ఉదయం 8.30 టైమ్‌లో తన స్కూటీని శంషాబాద్‌ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర నేషనల్ హైవే పక్కన ఆపి పని మీద వెళ్ళిన 26 ఏళ్ల దిశ… రాత్రి తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లబోయింది. అప్పటివరకూ ఆమె కోసం ఎదురుచూసిన ఆ నలుగురూ ఆమెను బలవంతంగా ఎత్తుకుపోయారు. ఓ పాత ప్రహరీ పక్కకు తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసారు. తర్వాత ఆమె ప్రాణాలు తీశారు. ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి బైపాస్‌ వంతెన కింద దహనం చేశారు.