మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు

TSRTC Busses
TSRTC Busses

హైదరాబాద్‌: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్‌టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 8 వరకు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్, జగద్గిరిగుట్ట, నేరేడ్‌మెట్, కెపిహెచ్‌బి, మియాపూర్, లింగంపల్లి, లాల్ దర్వాజ మొదలగు ప్రదేశాల నుంచి బయలుదేరి, ఉప్పల్‌లోని వరంగల్ పాయింట్ మీదుగా బస్సులు నడుపుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులు వివరాలను రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ వరప్రసాద్ ఎంజిబిఎస్‌లోని ఆయన కార్యాలయంలో ప్రకటించారు. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు ప్రయాణికులు జాతరకు వెళ్లేందుకు అడ్వాన్స్ రిజర్వేషన్ (www.tsrtconline.in) సౌకర్యం కల్పించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 26వ తేదీ ఆదివారం నాడు అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయోగాత్మకంగా ప్రత్యేక బస్సులు ఆన్‌లైన్‌లో ఏర్పాటుచేయడం జరిగిందని ఆర్‌ఎం వరప్రసాద్ చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/