నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయి

సిద్దిపేట: కరోనా వైరస్‌పై మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోందని.. అయితే ఇబ్బందిగా తీసుకోవాల్సిన అవసరం లేదని దైర్యంగా ఎదుర్కోవాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. మాస్క్ లేకుండా బయటకు రావద్దన్నారు. వస్తే వెయ్యి రూపాయల పైన్ వేసే చట్టాన్ని కేంద్రం తీసుకు వచ్చిందన్నారు. ప్రతిరోజూ ఆవిరి పడుతూ వేడినీరు తాగాలన్నారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల కేసులు పెరుగుతున్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో కేసులు తగ్గుముఖం పట్టి జిల్లాలలో పెరుగుతున్నాయని హరీష్‌రావు పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/