సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడి

Minister KTR inaugurated the oxygen wards
Minister KTR inaugurated the oxygen wards

sirisilla: జిల్లా ఆస్పత్రిలో కొవిడ్‌ ఐసీయూ, 40 పడకల ఆక్సిజన్‌ వార్డుతో పాటు కొవిడ్‌ అంబులెన్స్‌లను సోమవారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

అలాగే పంచాయతీరాజ్‌ ఈఈ, డీఈఈ కార్యాలయ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.   ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు.

జిల్లా ఆస్పత్రికి సీఎస్‌ఆర్‌ పథకం కింద రూ. 2.28 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలోనే రోజుకు వెయ్యి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

కరోనా బాధితులందరికీ హోం ఐసోలేషన్‌ కిట్లు అందిస్తామన్నారు.

బాధితుల సంఖ్య పెరిగితే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను కూడా ఐసోలేషన్‌ కేంద్రాలుగా వాడుకోవాలన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/kids/